నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన సమాచార కమిషనర్‌గా (సీఐసీ) రాజ్ కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాజ్ కుమార్ గోయల్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, పలువురు ప్రముఖులు హజరయ్యారు.
రాజ్ కుమార్ గోయల్ గతంలో కేంద్ర ప్రభుత్వ మాజీ హోం సెక్రటరీగా, లా సెక్రటరీగా పని చేశారు. పలు ముఖ్యమైన పదవులు కూడా నిర్వహించారు. రాజ్ కుమార్.. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇటీవలే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. గత సెప్టెంబర్‌లో హీరాలాల్ సమరియా పదవీ కాలం ముగియడంతో సీఐసీ పోస్టు ఖాళీ అయింది. అదనంగా 8 మంది కొత్త సమాచార కమిషనర్లు కూడా నియమితులయ్యారు. వీరంతా త్వరలో కొత్త సీఐసీ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలు పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడానికి దోహదపడతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



