నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. కొండాపూర్ మండలం మల్లేపల్లి పరిధిలో ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనదారుణ్ని కారుతో ఢీకొట్టి వెళ్లిపోయింది. గ్రామస్థులు వెంబడించి అడ్డుకున్నారు. క్షమాపణలు చెప్పాలని కోరగా.. నన్నే క్షమాపణ చెప్పమంటారా.. అంటూ వాగ్వివాదానికి దిగింది. ఆమెతోపాటు ఉన్న వ్యక్తి వంతపాడాడు. విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ సుమనుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేసి ఇద్దరూ మద్యం తాగినట్లు నిర్ధారించారు. కారులో మద్యం సీసాలున్నాయి. కారును సీజ్ చేసి కొండాపూర్ పీఎస్ కు తరలించారు. లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో యువతి వీరంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



