Tuesday, June 17, 2025
E-PAPER
Homeసినిమాఅందరి ఊహలకు మించి 'రాజా సాబ్‌'

అందరి ఊహలకు మించి ‘రాజా సాబ్‌’

- Advertisement -

ప్రభాస్‌, డైరెక్టర్‌ మారుతి కలయికలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రం ‘రాజా సాబ్‌’. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్స్‌గా నటిస్తు న్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ రాబోతోంది. సోమవారం ఈ చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ప్రభాస్‌ అభిమానులు, మూవీ లవర్స్‌ కేరింతల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా టీజర్‌ చూశాక నిర్మాత విశ్వప్రసాద్‌ విజన్‌ ఏంటో మీ అందరికీ తెలిసి ఉంటుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పేరు ఎప్పటికీ గుర్తుండేలా ఈ సినిమా ఉంటుంది. ప్రభాస్‌ నమ్మి మూవీ చేస్తున్నారు. ఆయనకు నా బెస్ట్‌ ఇస్తానని మారుతి నాతో చెబుతుంటాడు. ఇది మూవీ లాంచ్‌ కాదు, ట్రైలర్‌ లాంచ్‌ కాదు జస్ట్‌ టీజర్‌ లాంచ్‌. ఇక్కడే ఇంత రెస్పాన్స్‌ చూస్తున్నాం. డిసెంబర్‌ 5న బాక్సాఫీస్‌ దగ్గర కొత్త చరిత్ర సష్టిస్తుంది. ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌, కార్తిక్‌ పళని సినిమాటోగ్రఫీ, రాజీవన్‌ సెట్స్‌ అన్నీ హైలైట్‌ అవుతాయి’ అని తెలిపారు.
‘మా సంస్థ నుంచి వస్తున్న బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఇది. ఈ సినిమా కోసం మరే సినిమాకు నిర్మించని బిగ్గెస్ట్‌ ఇండోర్‌ సెట్‌ వేశాం. వీఎఫ్‌ఎక్స్‌, మేకింగ్‌ గ్రాండియర్‌లో థర్డ్‌ బిగ్గెస్ట్‌ మూవీ అని చెప్పగలను. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మీ అంచనాలు అన్నీ అందుకుంటూ మా సినిమా అన్ని బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ని బ్రేక్‌ చేస్తుంది. ప్రభాస్‌ వరల్డ్‌ సినిమాకు బిగ్గెస్ట్‌ ఐకాన్‌. ఆయనతో కలిసి మూవీ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది. మారుతి బెస్ట్‌ డైరెక్టర్‌. ఈ సినిమా బిగినింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటుంది. 2024లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తూ అతి పెద్ద విజయాన్ని సాధించబోతోంది. ఈ మూవీకి సీక్వెల్‌ పాన్‌ వరల్డ్‌ స్థాయిలో ఉంటుంది’ అని ప్రొడ్యూసర్‌ టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు.
డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ, ‘నేను ప్రభాస్‌ని కలిసినప్పుడు ‘ప్రేమకథా చిత్రమ్‌, భలే భలే మగాడివోరు’ మూవీస్‌ ఇష్టం. అలాంటి సినిమా చేద్దామని నాతో చెప్పారు. నేను ఒక లైన్‌గా ఈ కథ చెప్పా. ఆ తర్వాత నేను గోపీచంద్‌తో చేసిన ‘పక్కా కమర్షియల్‌’ మూవీ అంతగా ఆదరణ పొందలేదు. ఆ టైమ్‌లో నేను ప్రభాస్‌తో మూవీ చేయడం కరెక్టేనా అనే సందేహంతో ఉన్నప్పుడు మీరు చెప్పిన స్టోరీలో ఈ పాయింట్స్‌ చాలా బాగున్నాయి అంటూ ప్రభాస్‌ చెెప్పడం ప్రారంభించారు. ఈయనకు ఇంత బాగా కథ ఎగ్జైట్‌ చేసినప్పుడు మనం వెనకడుగు వేయడం ఎందుకు అనిపించింది. దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. టీజర్‌ మిమ్మల్ని ఇంతలా ఆకట్టుకుంది. రేపు ట్రైలర్‌, మూవీ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. మీరు ప్రభాస్‌ని ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించబోతున్నాం. ప్రభాస్‌లో ఒక స్పెషల్‌ కామెడీ టైమింగ్‌ ఉంటుంది. ఆ టైమింగ్‌ను ఈ మూవీలో ఎంజారు చేస్తారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -