Thursday, January 1, 2026
E-PAPER
Homeజిల్లాలురాయపోల్‌ మండల విద్యాశాఖ అధికారిగా రాజగోపాల్ రెడ్డి

రాయపోల్‌ మండల విద్యాశాఖ అధికారిగా రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-రాయపోల్: రాయపోల్ మండల నూతన విద్యాశాఖ అధికారిగా శేగ్గారిగారి రాజా గోపాల్ రెడ్డిని నియమించినట్టు జిల్లా విద్యాశాఖ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విద్యాశాఖ అధికారిగా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి ఇటీవల ఉద్యోగ పదవి విరమణ పొందారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ఎంఈఓ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా విధానాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు కృషి చేస్తానన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధ్యాయుల బాధ్యతాయుత పాత్ర, తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా గుణాత్మక విద్య అందించడమే తన కార్యాచరణ అని స్పష్టం చేశారు.

మండలంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల హాజరు శాతం పెంపు, డ్రాప్‌అవుట్‌ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.బాధ్యతల స్వీకరణ అనంతరం విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో రాయపోల్ మండల విద్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మేరీ నిర్మల, గోవర్ధన్, రాజ్ కుమార్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -