Friday, June 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రాజాసాబ్ టీజర్..ఇది కదా డార్లింగ్ నుండి ఎదురుచూసేది

రాజాసాబ్ టీజర్..ఇది కదా డార్లింగ్ నుండి ఎదురుచూసేది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. అదిరిపోయే పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను.. ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టే మారుతి వింటేజ్ డార్లింగ్‌ను చూపించబోతున్నాడు.
కాగా కొద్దీ సేపటి క్రితం రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. వాస్తవానికి మారుతీతో సినిమా అనగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కాని ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూసాక ఇది కదా మేము డార్లింగ్ నుండి ఎదురుచూసేది అని మారుతీని ఓ రేంజ్ లో పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ లో వింటేజ్ లుక్ ప్రభాస్ అదరగొట్టాడు. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అనే చెప్పాలి. చివర్లో డార్లింగ్ చెప్పిన డైలాగ్ టీజర్ కె హైలెట్. ఏదేమైనా చాలా కాలంగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ లాంటి టీజర్ ఇచ్చాడు దర్శకుడు మారుతి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -