No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలురాజీవ్ యువ వికాసం..వారికి మాత్ర‌మే..!

రాజీవ్ యువ వికాసం..వారికి మాత్ర‌మే..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీంను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఐదు క్యాటగిరీలుగా విభజించి యూనిట్లను మంజూరు చేస్తుంది. క్యాటగిరీల వారీగా బ్యాంకు రుణాలతోపాటు కొంతమొత్తం సబ్సిడీని కల్పిస్తుంది. దీంతో రాష్ట్రంలో పెద్దెత్తున ప్రజలు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీంకు 16,25,441 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనార్టీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనార్టీల నుంచి 2,689 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మండల ఆఫీసర్లు 70శాతం అప్లికేషన్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్కీం కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును బ్యాంకు అధికారులుసైతం చెక్ చేయాల్సి ఉంది. దీంతో చాలామంది దరఖాస్తుదారులు ఈ పథకంకు అనర్హులగా తేలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంకర్లు లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు.. గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకుని కట్టకపోయి డిఫాల్టర్ గా మిగిలిన వారి అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోరని తెలుస్తోంది. లోన్, వడ్డీ కట్టని డిఫాల్టర్లు, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్లను మినహాయిస్తే సుమారు 60శాతం మంది అర్హులు అవుతారని.. మిగిలిన 40శాతం మంది అనర్హులుగాతేలే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad