Wednesday, April 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయువ‌త‌కు రజ‌నీకాంత్ కీల‌క సందేశం

యువ‌త‌కు రజ‌నీకాంత్ కీల‌క సందేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌ముఖ న‌టుడు రజ‌నీకాంత్ యువ‌త‌కు కీల‌క సందేశం ఇచ్చారు. యువ‌కులు భ‌వ‌ష్య‌త్‌పై దృష్టి పెట్టాల‌ని, అందుకు త‌గ్గట్లు మార్గాలు ఎంచుకోవాల‌ని ఆయ‌న సూచించారు. డ్ర‌గ్స్, అల్కహాల్ మాని చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్టాల‌ని కోరారు. త‌మిళ‌నాడులోని చైన్నై ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. యువత జాగ్రత్తగా ఉండాలి..వారి చదువుల‌పై దృష్టి సారించి ఆరోగ్యంగా ఉండాల‌న్నారు. డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌కు బానిసలు కావద్దు.. మీకే కాదు, మీ తల్లిదండ్రులకు కూడా న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదముంద‌ని చెప్పారు.

ఆయ‌న న‌టిస్తున్న‌ ‘జైలర్ 2’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇది ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన ఒరిజినల్ ‘జైలర్’ తర్వాత ఈ సీక్వెల్ వస్తోంది. ‘జైలర్ 2’తో పాటు, తోటి ఇండస్ట్రీ ఐకాన్ కమల్ హాసన్‌తో తన కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా రజనీకాంత్ ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో, కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘తలైవర్ 173’లో కూడా ఆయన కనిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -