నవతెలంగాణ-హైదరాబాద్: దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పిచారని కొనియాడారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారని వివరించారు.మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా… సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. వారితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్ కుమార్ యాదవ్, మండలి ఛీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి: సీఎం రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES