నవతెలంగాణ – కంఠేశ్వర్
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ నిలిచిపోయారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు భారత రత్నా స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్ నందు ఆ మహనీయుడి చిత్రపటానికి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా వినాయక్ నగర లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. యువతను 18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించి యువతను రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేలా చేసిన సంస్కరణకర్త అని, ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన పాలనడక్షులు అని,జాతీయ విద్య విధానం అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్త అని కొనియాడారు. 40 ఏళ్ల వయసులోనే దేశానికి ప్రధాని అయిన గొప్ప నేత అని, దేశ మొదటి ప్రధాని నెహ్రూ మనుమడిల,ఏకైక మహిళ ప్రధాని ఇందిరా గాంధీ పెద్ద కుమారుడిగా గొప్ప పేరు ఆయనకు ఉంది అని అన్నారు.అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ఐదేళ్ల పాటు ఆయన సేవలు అందిస్తూ అభివృద్ధి చేశారు అని అన్నారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారి వాజ్పేయ్ ఆరోగ్యం కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్ధిక సహాయం మంజూరు చేసిన చరిత్ర రాజీవ్ గాంధీ ది.ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రధాని రాజీవ్ గాంధీపై అవాకులు చెవాకులు పిలుస్తున్నారు అని, నరేంద్రమోడి ఒక ప్రధాని స్థానంలో ఉంటూ అనాల్సిన మాటలు కావు అని, ఆయన తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారని అన్నారు.రాజీవ్ గాంధీ స్ఫూర్తిని ఎవరు చెరిపివేయలేరన్నారు. యాంటి డిఫెక్షన్ లా ద్వారా పార్టీ ఫిరాయింపులను కట్టడి చేశారని,పాలనలో తాతను,నిర్ణయాల్లో తల్లిని జ్ఞాపకం తెచ్చేలా చేస్తూనే తనను తను అరుదైన నాయకుడిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ అని,అన్నారు. విదేశీ విధానాన్ని విజయంతంగా అమలు చేస్తూనే,ఎన్నో దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరిచారని,ఇవాళ ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశించిన సమాజం వాస్తవం రూపంలో కనిపిస్తుంది అని, ఎన్నటికి రాజీవ్ గాంధీ రూపం ఆలోచనలు ప్రజల్లో ఉంటాయని,ఆయన ఆశయాలు ఆలోచనలు అందిపుచ్చుకుని యువకులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్,డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మాజీ పిసిసి కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు గోపి,రాష్ట్ర ఎన్ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,జిల్లా ఫిషర్మాన్ అధ్యక్షులు శ్రీనివాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈసా,పోల ఉష,పుప్పాల విజయ,సుభాష్ జాదవ్,సలీం, అవిన్,సంగెం సాయిలు,యెండల కిషన్,నికిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES