Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeజాతీయండిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా రాజీవ్ ఘాయ్‌

డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా రాజీవ్ ఘాయ్‌

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆపరేషన్ సింధూర్ లో భాగమైన రాజీవ్ ఘాయ్‌కు మరో బాధ్యత లభించింది. భారత ప్రభుత్వం ఆయనను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా నియమించింది. దీనితో పాటు, ఆయన భారత DGMOగా కూడా పనిచేస్తారు. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనతో ధృవీకరించింది. భారత సైన్యం, నిఘా సంస్థతో సహా ఇతర ముఖ్యమైన విభాగాల మధ్య సమన్వయం కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (స్ట్రాటజీ) పదవిని సృష్టించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది భారత సైన్యంలోని ముఖ్యమైన పోస్టులలో ఒకటి.

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కుమావున్ రెజిమెంట్‌లో సీనియర్ అధికారి. భారత సైన్యంలో కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. డీజీఎంఓ కావడానికి ముందు, ఆయన చినార్ కార్ప్స్‌కు GOCగా ఉన్నారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేక మిషన్లలో రాజీవ్ ఘాయ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. జూన్ 4న జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ 2025 సందర్భంగా లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్‌కి ఉత్తమ యుద్ధ సేవా పతకం లభించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad