నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్‌కు చేరుకున్నారు. గురువారం శ్రీనగర్ లోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పహల్గాం దాడి తర్వాత రాజ్‌నాథ్ సింగ్ మొదటిసారి జమ్మూలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆర్మీ త్రివిద దళాల అధిపతులతో ఆయన భేటీ అయ్యారు. భారత్ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ , సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిణామాలపై చర్చించారు. గురువారం మరోసారి జమ్మూ చేరుకొని ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఎల్ఓసీ, సరిహద్దు వెంబడి భద్రతా చర్యలపై సమీక్షించనున్నారు.
జమ్మూలో రాజ్‌నాథ్ సింగ్ పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES