Wednesday, May 21, 2025
Homeసినిమాప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే 'రక్షక్‌'

ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసే ‘రక్షక్‌’

- Advertisement -

మంగళవారం హీరో మంచు మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా చేస్తున్న కొత్త సినిమాను అఫీషియల్‌గా మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. గ్రిప్పింగ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘రక్షక్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనిధి క్రియేషన్స్‌ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్‌ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ పోస్టర్‌ చాలా ఇన్నోవేటివ్‌గా, ఇంటెన్స్‌గా ఉంది. మంచు మనోజ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించారు. పోస్టర్‌పై కనిపించే ‘దాచిన నిజం శాశ్వతంగా దాగి ఉండదు’ అనే ట్యాగ్‌లైన్‌ కథలోని మిస్టరీని సూచిస్తుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో చాలా బిజీగా ఉన్న మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘భైరవం, మిరారు ‘ సినిమాల్లో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు ‘రక్షక్‌’ చిత్రంతో మళ్లీ హీరోగా అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ థ్రిల్లింగ్‌ క్రైమ్‌ డ్రామా ప్రేక్షకులకు ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ తెలియజేస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -