Thursday, May 8, 2025
Homeరాష్ట్రీయంసైన్యానికి సంఘీభావంగా నేడు ర్యాలీ

సైన్యానికి సంఘీభావంగా నేడు ర్యాలీ

- Advertisement -

– హాజరు కానున్న సీఎం, మంత్రులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు జరిగే ఈ ప్రదర్శనలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.
విదేశీ పర్యాటకులకు భద్రత కల్పించాలి : సీఎం ఆదేశం
ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో, తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర నిఘా బృందాలతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర నిఘా బృందాలకు సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -