Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరామన్నపేట ఆస్పత్రిని వంద పడకలకు పెంచాలి

రామన్నపేట ఆస్పత్రిని వంద పడకలకు పెంచాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు
– మంత్రి దామోదర, ఎమ్మెల్యే వీరేశంను కలిసిన సీపీఐ(ఎం) నాయకులు
– అసెంబ్లీలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తామన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
నవతెలంగాణ- రామన్నపేట

యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చడంతోపాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూ హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్‌రెడ్డి కలిశారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు అసెంబ్లీ ఆవరణలో నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను సీపీఐ(ఎం) నాయకులు కలిసి రామన్నపేటలో వంద పడకల ఆస్పత్రి అవసరాన్ని వివరించారు. రూ. 40 కోట్లు విడుదల చేసి 100 పడకలుగా అభివృద్ధి చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ ప్రజాపాలనలో తప్పకుండా రామన్నపేటలో 100 పడకల ఆస్పత్రిగా పెంచడంతోపాటు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆస్పత్రి సమస్యను ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, నిధులు విడుదలయ్యేలా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీక్షలను విరమించాలని కోరారు. సీపీఐ(ఎం) చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు వివిద వర్గాల ప్రజల నుంచి మద్ధతు లబిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -