నవతెలంగాణ – మద్నూర్
మండల కేంద్రానికి చెందిన వ్యాపారవేత రాంప్రసాద్ ఇనాని సెట్ కు ఎంత గుర్తింపును ఇచ్చిన తక్కువేనని మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అన్నారు. ఇనాని సెట్ మద్నూర్ గ్రామ అభివృద్ధి ప్రధాత పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇనాని సెట్ కుటుంబం ప్రభుత్వ పరంగా వివిధ రకాల కార్యాలయాల ఏర్పాటు కోసం ఎకరాల కొలది భూమిని ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఆయన పేరునే ఉన్నాయని అన్నారు. మద్నూర్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేని అన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో రాంప్రసాద్ హినాని సెట్ విగ్రహం గతంలో ఏర్పాటు చేయగా.. ఆ విగ్రహం చుట్టుపక్కల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి శనివారం నల్లమట్టితో పనులు ప్రారంభించారు. భూదాత ఇనాని సేటుకు గుర్తింపుగా ఆయన విగ్రహం పక్కన అభివృద్ధి పనులకు సర్పంచ్ సంతోష్ మేస్త్రీ శ్రీకారం చుట్టడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు.
రాంప్రసాద్ ఇనాని సేట్ సేవలు మరువలేనివి: సర్పంచ్ సంతోష్ మేస్త్రీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



