Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపికైన రాంసాగర్ విద్యార్థి

ఎస్జిఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపికైన రాంసాగర్ విద్యార్థి

- Advertisement -

-మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి..
నవతెలంగాణ – రాయపోల్ 
69 వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో అండర్ -14 విభాగంలో రాంసాగర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి. స్వప్న ఎంపికయ్యారని తెలిపారు. పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్న స్వప్న రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిని, విద్యార్థులను ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అనీఫ్, ఉపాధ్యాయులు, సిఆర్పి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -