నవతెలంగాణ – హైదరాబాద్: దగ్గుబాటి వెంకటేశ్, రానా కాంబోలో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో విడుదలయ్యి మంచి రికార్డు వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో నాగానాయుడు (వెంకటేశ్), రానా నాయుడు (రానా) తండ్రీ కొడుకులుగా నటించారు. వారి మధ్య నడిచే ట్రాక్‌లో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ, మిగిలిన కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. ‘రానా నాయుడు’ విజయంతో, చిత్రబృందం సీజన్ 2 రాబోతుందని ఇప్పటికే ప్రకటించింది. ఈ సందర్భంగా తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఇందులో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
‘రానా నాయుడు’ సీజన్ 2 టీజర్ విడుదల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES