నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్గానిక్ మరియు నేచర్ ఫామిలీ సాగులో నల్లగొండ బత్తాయి పంటకు అరుదైన గౌరవం దక్కిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని కే సుభాషిణి అన్నారు. రాష్ట్రంలో ముగ్గురు రైతులని ఎంపిక చేయగా, వారిలో ఇద్దరు నల్గొండ జిల్లా బత్తాయి రైతులు కావడం గర్వించదగ్గ విషయమానరు. నల్గొండ జిల్లాలో బత్తాయి తోటలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, జిల్లాలో కొంతమంది రైతులు వి నూతన సాగు విధానం అవలంబించి అధిక దిగుబడులు మరియు నాణ్యమైన పంట దిగుబడులు సాధించడం జరిగిందని వారిని నేషనల్ రీజినల్ ఆర్గానిక్ నాగపూర్ వారు మన జిల్లా నుంచి ఇద్దరు రైతులు గుర్తించినట్లు తెలిపారు,జిల్లాలో,గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన కట్టబోయిన శ్రీనివాస్ యాదవు మరియు తిరుమలగిరి సాగర్ మండలం మలిగిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన మలిగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే బత్తాయి రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వారు బత్తాయి సాగును ఆర్గానిక్ పద్ధతిలో అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు, 2025-2026 సంవత్సరానికి భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తేదీ 7 శనివారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కేంద్రంగా ప్రధానోత్సవం అందించబోతున్నట్లు వారు తెలిపారు.
బత్తాయి సాగును గుర్తించినందుకు ధన్యవాదాలు
గత దశాబ్ద కాలంగా నల్గొండ జిల్లాలో వేల ఎకరాల్లో బత్తాయి సాగు అవుతుంది కానీ ప్రభుత్వం నుంచి గుర్తింపు ఆధార అభిమానాలు కరువయ్యాయని నేటికి బత్తాయి రైతులకు ఆ గౌరవం దక్కిందని బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షుడు సురుగురు శ్రీనివాస్ రెడ్డి గౌరవాధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి అన్నారు.బత్తాయి రైతులకు గుర్తించిన ఉద్యానవన శాఖ డైరెక్టర్ యస్మిన్ భాష గారికి మరియు శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు నాయక్ గారికి,జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని సుభాషిణి గారికి మండల ఉద్యానవన శాఖ అధికారులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లాలో ఇద్దరు బత్తాయి రైతులను గుర్తించడం గర్వించదగ్గ విషయమని వారు కొనియాడారు. ఈ గౌరవం జిల్లాలో బత్తాయి సాగు చేసే ప్రతి బత్తాయి రైతుకి ఈ గౌరవం దక్కిందని భావిస్తామని.అదేవిధంగా కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ మలిగిరెడ్డి భాస్కర్ రెడ్డి వారు చేసే సాగు విధానని జిల్లాల్లో ఉన్న ప్రతి బత్తాయి రైతుకి మా సంఘం తరఫున అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
నల్గొండ బత్తాయి రైతుకు అరుదైన గౌరవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



