Saturday, October 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌పై ర‌షిద్ ఖాన్ తీవ్ర ఆగ్ర‌హాం

పాకిస్థాన్‌పై ర‌షిద్ ఖాన్ తీవ్ర ఆగ్ర‌హాం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్ జ‌రిపిన‌ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘ‌ట‌న‌పై క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధగా ఉందని రషీద్ ఖాన్ అన్నారు. ప్రపంచ వేదికపై దేశం కోసం ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నారని.. కానీ వారు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు. మరో అంతర్జాతీయ ఆటగాడు మహ్మద్ నబీ మాట్లాడుతూ.. ‘‘ఈ సంఘటన పాక్టికాకు మాత్రమే కాదు.. మొత్తం ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి.. దేశం మొత్తానికి విషాదం’’ అని తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోయారు. వచ్చే నెలలో పాకిస్థాన్-శ్రీలంకతో జరిగే త్రి-దేశాల సిరీస్‌లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్థాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్లినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) తెలిపింది. ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడికి పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇది పిరికి దాడిగా ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఈ ఘటన తర్వాత ఆప్ఘనిస్థాన్ త్రి-దేశాల సిరీస్ నుంచి వైదొలిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -