Magazines

ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

53 నిమిషాల క్రితం

Good news for airport passengers.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

‘పుష్పక్‌’ బస్సు చార్జీలు 40శాతం తగ్గింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
​శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే ‘పుష్పక్‌’ ఏసీ బస్సుల చార్జీలను 40 శాతం వరకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ నూతన చార్జీలు ఈనెల 7వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఈడీ) అంచూరి శ్రీధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీగా తగ్గిన చార్జీలతో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో ఏసీ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చని పేర్కొన్నారు. ​

రూట్ల వారీగా తగ్గిన చార్జీల వివరాలు
మియాపూర్‌ మార్గం

​మియాపూర్ ఎక్స్ రోడ్- రూ.350 నుంచి రూ.250
జేఎన్‌టీయూ -రూ.350 నుంచి రూ.200
శిల్పారామం- రూ.300 నుంచి రూ.200
గచ్చిబౌలి- రూ.300 నుంచి రూ.150​
లింగంపల్లి రూట్‌

​ఆల్విన్ ఎక్స్ రోడ్- రూ.350 నుంచి రూ.200
లింగంపల్లి- రూ.300 నుంచి రూ.200
కొండాపూర్- రూ.300 నుంచి రూ.200
కొత్తగూడ, గచ్చిబౌలి- రూ.300 నుంచి రూ.150 ​

జేబీఎస్ (సికింద్రాబాద్) మార్గం ​జే
బీఎస్ నుంచి ఎయిర్‌పోర్ట్‌- రూ350 నుంచి రూ.200
ఎయిర్‌పోర్ట్ నుంచి జేబీఎస్- రూ.400 నుంచి రూ.300
జేబీఎస్ నుంచి మెహిదీపట్నం, ఆరంఘర్, మందమల్లమ్మ వరకు చార్జీ రూ.100 మాత్రమే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్