డబ్బు కంటే నిజాయితీ, సేవకే ప్రాధాన్యతనివ్వాలి : కొత్త జిల్లా రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం ఒక పదవి కాదనీ, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రూప్-1 ద్వారా నియమితులైన శిక్షణ పొందిన అనంతరం వివిధ జిల్లాలకు నూతనంగా నియమితులైన జిల్లా రిజిస్ట్రార్లు డి మౌనికారాణి (నల్లగొండ), సయ్యద్ యూసఫ్ ఆలీ( ఎంవీఏ నల్లగొండ), షగుఫ్టా ఫిర్‌డౌస్ (వరంగల్) డి సందీప్ కుమార్ (సంగారెడ్డి), బొంగు మాధవ్ (హైదరాబాద్- సౌత్), పి దీపక్ (మహబూబ్‌నగర్) మంగళవారం సచివాల యంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సేవాభావంతో పనిచేయాలనీ, ప్రజల విశ్వాసం పొందాలని కోరారు. రిజిస్ట్రేష న్ శాఖ నేరుగా ప్రజల ఆస్తులు, భూములు, ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున అధికారులు అత్యంత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదిం చారనీ, సర్వీస్ చాలా ఉందని చెప్పారు. పని తీరుతోనే మంచి పేరు వస్తుందనీ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సేవా దృక్పథంతో పనిచేయాలని సూచిం చారు. కెరీర్‌లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదనీ, ప్రజలకు నమ్మకంతో కూడిన సేవలు అందిం చడమే నిజమైన సంపద అని వివరించారు. నిజాయితీగా, పారదర్శ కంగా పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానా లకు అనుగు ణంగా, ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, నిబంధనల పరిధిలో వేగంగా పరిష్కారాలు చూపాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాల యాలకు వచ్చే ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించా లన్నారు. పేదలు, సామాన్య ప్రజలు ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాల యాలకు వచ్చిన ప్పుడు వారికి గౌరవంగా, సహాయకారిగా వ్యవహరించాలని సూచించారు.







కామెంట్‌లు (0)