Magazines

మేడిగడ్డ బ్యారేజీ పేలుడు కేసును ఎలా మూసేస్తారు?

1 గంట క్రితం

How can the Medigadda Barrage explosion case be closed?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

ఆంధ్ర ప్రయోజనాల కోసమే కాఫర్ డ్యాం కట్టలేదు : బీఆర్‌‌స్‌ ‌రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ ‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

 మేడిగడ్డ బ్యారేజీ పేలుడు కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా ఎలా మూసేస్తారని బీఆర్‌‌స్‌ ‌రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ ‌కుమార్‌ ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసు నమోదైన వెంటనే నేర స్థలాన్ని సీజ్ చేసి క్రాక్స్ వచ్చిన పిల్లర్ దగ్గర షాంపిళ్లు సేకరించి ఎందుకు విశ్లేషించలేదని నిలదీశారు.

 2023 అక్టోబర్‌ 21‌న ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ‌రవికాంత్‌ ‌ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174/2023 ఐపీసీ సెక్షన్‌ 357 ప్రకారం కేసు నమోదు అయిందని గుర్తు చేశారు. సాక్ష్యం లేదనీ, తప్పుడు సమాచారం అనీ, అన్ డిటెక్టివ్ అని పోలీసులు కేసు మూసేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నదని విమర్శించారు. ఆంధ్రా ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను ఎత్తిపోయలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కార్‌ ‌చేసిన నిర్వాకం వల్ల

ఇప్పటికే 734 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని ఆరోపించారు. వెంటనే మెడిగడ్డ వద్ద కాఫర్‌ ‌డ్యాం కట్టి నీటిని ఎత్తిపోయకుంటే రాబోయే వేసవిలో తెలంగాణలో తాగునీటికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాబోయే రోజుల్లో తెలంగాణలో రూ.25 వేల కోట్ల పంట నష్టం జరుగబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 2015 ,2016 లో కూడా ఎల్ నినో వచ్చినా, క్రాప్ హాలిడే ప్రకటించలేదని ‌గుర్తు చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదనీ, కాంగ్రెస్‌ ‌తెచ్చిన కరువని ఆరోపించారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్