Magazines

ఏడాదిలోపే ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌ పూర్తి

47 నిమిషాల క్రితం

ఇందిరమ్మ ట‌వ‌ర్స్
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

వేగంగా నిర్మించే కాంట్రాక్ట‌ర్ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు :మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వెంటనే లబ్దిదారుల 
చేతికి తాళాలిస్తాం
గాజులరామారంలో ఇందిరమ్మ టవర్స్‌‌కు శంకుస్థాపన

నవతెలంగాణ-సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్‌ ​
‘క్యూర్’ ప‌రిధిలో తొలివిడ‌త ప్ర‌యోగాత్మ‌కంగా నిర్మిస్తున్న ల‌క్ష ఇండ్ల ఇందిరమ్మ ట‌వ‌ర్స్ నిర్మాణాల‌ను పార‌ద‌ర్శ‌కంగా, వేగంగా పూర్తి చేసి ఏడాదిలోగా అందించేందుకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల చ‌ర్య‌లూ తీసుకుంటోంద‌ని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా కాంట్రాక్ట‌ర్ల‌కు ఏడాది గ‌డువును నిర్దేశిం చామ‌ని, నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 ల‌క్ష‌లు, రెండు నెల‌ల ముందుగా పూర్తి చేస్తే రూ.90 ల‌క్ష‌ల ప్రోత్సాహ‌కం బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని చెప్పారు. మేడ్చల్‌-‌మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు మంగ‌ళ‌వారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, ఎమ్మెల్యే కె పి.వివేకానంద, శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 23 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇందిరమ్మ ట‌వర్స్‌‌ను నిరంత‌ర ప్ర‌క్రియ‌గా నిర్మిస్తామ‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇండ్ల కోసం 7వేల మందికి పైగా దరఖాస్తు లు అందగా, పరిశీలన అనంతరం 5,218 మంది అర్హులుగా తేలారని చెప్పారు. లబ్ది దారుల ఎంపికను బహిరంగంగా లక్కీ డ్రా ద్వారా చేపట్టి 480 మంది లబ్దిదారులతో తుది జాబితాను సిద్ధం చేశామని వెల్లడిం చారు. ఎంపిక ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానం లో పారదర్శకంగా నిర్వహించా మని, ఎవరికి ఏ విధంగా ఇల్లు మంజూరైం దనే వివరాలను కూడా లబ్దిదారులకు తెలియ జేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాల ను అందజేస్తామని చెప్పారు. మరో మూడు విడతల్లోనూ ఇండ్ల నిర్మాణం చేపడతామ న్నారు. ప్రస్తుతం సుమారు 7.5 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, నియోజకవర్గంలో ఉన్న ఇతర ప్రభుత్వ, హౌసింగ్ శాఖ భూములను గుర్తించి అక్కడ కూడా పేదలకు ఇండ్లు నిర్మించే చర్యలు చేపడతామని తెలిపారు.
పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగవ్వాలి: మంత్రి శ్రీధర్ బాబు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నా పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. కొత్తగా నిర్మించే టవర్స్ సముదాయంలో ఆలయాలు, మసీదులు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాలను నిర్మించుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించేలా పరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ‘క్యూర్’ పరిధిలోని కాలుష్య పరిశ్ర‌మలను వెలుపలికి తరలించి స్వచ్ఛమైన గాలి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ను చౌద‌రి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మెన్‌ శ్రీ‌నివాస‌రెడ్డి, హౌసింగ్ శాఖ సెక్రెట‌రీ వి.పి.గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్