Magazines

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశ భవిష్యత్

51 నిమిషాల క్రితం

ల్ రెడ్డి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

టీశాట్‌ సీఈవో వేణుగోపాల్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌
తరగతి గదుల్లో విద్యను బోధించే ఉపాద్యాయుల చేతుల్లోనే భారతదేశ బంగారు భవిష్యత్ ఆధారపడి ఉందని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ టి-సాట్ కార్యాలయంలో పీఎం ఈ-విద్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్ ప్రొగ్రాంకు ముఖ్యఅతిధిగా హాజరైన వేణుగోపాల్ రెడ్డి ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు నాణ్యమైన కంటెంట్ అందించడం వల్లే విద్యను నేర్చుకోగలుగుతారని చెప్పారు. తద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ కంటెంట్ చూసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తుచేశారు. డిజిటల్ కంటెంట్ పైనే దేశ భవిష్యత్ అని గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విద్యపై ప్రత్యేక శద్ధతో అధిక నిధులు కేటాయించడమే కాకుండా డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. పీఎం ఈ-విద్య డిజిటల్ ఛానళ్ల ఢిల్లీ ఇన్ ఛార్జ్ ప్రొఫెసర్ అభయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు డిజిటల్ ఛానళ్లను కేటాయించిందనీ, వాటి ద్వారా ప్రసారం చేసే డిజిటల్ కంటెంట్ ను విద్యార్థులు ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. సాట్ కాం డైరెక్టర్ (గుజరాత్) రాజేష్ పటేల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రసారం చేస్తున్న 200 ఛానళ్లలో ఐదు తెలంగాణా రాష్ట్రానికి కేటాయించిందని గుర్తుచేశారు. ఐదు ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేసారు. పీఎం ఈ-విద్య ఛానళ్ల హెచ్వోడీ పుర్వి చాజెద్, ప్రొడ్యూసర్ బినితారాయ్, అకడమిక్ కన్సల్టెంట్స్ కోమల్ అరోరా, వైశాలి, రుచి ఎల్ ఖత్రీ, టి-సాట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్ ఎండీ సాధిక్, జీఎం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నాలుగు రోజుల శిక్షణ
డిజిటల్ కంటెంట్ తయారు చేయడంలో తెలంగాణలోని సుమారు 100 మంది ఉపాధ్యాయులకు నాలుగు రోజుల పాటు పీఎం ఈ-విద్య ఆధ్వర్యంలో మంగళవారం వీడీయో ప్రొడక్షన్-హార్డ్వేర్, రెండవ రోజు కాపీ రైట్ అండ్ ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ, మూడవ రోజు రికార్డింగ్ ఆఫ్ డెవెలప్డ్ స్క్రిప్ట్ చివరి రోజైన నాల్గవ రోజు వీడియో ప్రజంటేషన్ అండ్ ఎవాల్యూయేషన్ పై శిక్షణ ఉంటుంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్