సీఎం రేవంత్‌రెడ్డికి వినతి :
తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
: ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్‌వాడీ కేంద్రాలకు 13 రోజులు దసరా సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె సునీత, పి జయలక్ష్మి సీఎం రేవంత్‌రెడ్డికి వినతి పత్రాన్ని పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10 నుండి 22 వరకు 13 రోజుల పాటు దసరా సెలవులను ఇవ్వనున్నందున అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా 13 రోజులు దసరా సెలవులు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు సెలవులున్నపుడు అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు రావటం లేదని తెలిపారు. వంట చేస్తే వృథా అవుతుందని పేర్కొన్నారు. బతుకమ్మ సంబరాలు ఊరంతా పండుగ వాతావరణం ఉన్నప్పుడు కేంద్రాలు ఓపెన్ పెట్టటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు దసరా సెలవులు ఇవ్వాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)