Magazines

తొలగించిన ఓట్లను
పునరుద్ధరించాలి

2 రోజుల క్రితం

Deleted votes
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఈసీ వైఖరి మార్చుకోకపోతే కార్యాలయాన్ని తగలబెడతాం : మాజీ మంత్రి దానం నాగేందర్‌ 
సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ-హిమాయత్ నగర్ ​
తొలగించిన ఓట్లను ఎన్నికల కమిషన్‌ యథావిధిగా పునరుద్ధరించాలని మాజీ మంత్రి దానం నాగేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈసీ తన వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్‌ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ అధికారులు బీజేపీతో కుమ్మక్కై, వారికి అనుబంధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. కేవలం హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో దాదాపు 20 వేల ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ఆరోపించారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు వ్యవస్థీకృతంగా ‘ఓట్‌ చోరీ’కి పాల్పడుతున్నారని అన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటునూ కాపాడుకునే పూర్తి బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నో ఏండ్లుగా స్థానికంగా ఉంటున్న ప్రజల ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి, ఈసీకి వ్యతిరేకంగా నగరంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్