నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ సహకారంతో భారతదేశపు తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌ను హైదరాబాద్ బాచుపల్లిలో కెఎల్ హెచ్ యూనివర్సిటీ ప్రారంభించింది. సాంకేతికత ఆధారిత విద్య, పరిశ్రమలతో భాగస్వామ్యం మరియు భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్యను బలోపేతం చేయాలనే కొనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కొనేరు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ కొనేరు లక్ష్మణ్ హవీష్, వైస్ ఛాన్సలర్ డా. జి. పార్థ సారధి వర్మ, వైస్ ఛాన్సలర్, దార్శనికత, నాయకత్వానికి ఈ కార్యక్రమం ప్రతిబింబంగా నిలుస్తుంది. హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ నేషనల్ హెడ్ దీపక్ సర్వనన్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. కెఎల్ హెచ్ యూనివర్సిటీ, హైదరాబాద్, హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ మధ్య అవగాహన ఒప్పందం మార్పిడి కార్యక్రమం కూడా జరిగింది. ఏజెంటిక్ ఏఐ విద్య, విద్యార్థుల ఆవిష్కరణలు, పరిశ్రమ అనుభవం మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో మరింత బలమైన సహకారానికి ఈ ఎంఓయు పునాది వేసింది. కెఎల్ హెచ్ యూనివర్సిటీ తరఫున ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. కోటేశ్వరరావు, ఎంఓయు మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ డీన్ డాక్టర్ ఏ. శ్రీనాథ్ ఈ కార్యక్రమంలో కీలకంగా పాల్గొన్నారు. ఈ భాగస్వామ్యంలో నైపుణ్య ఆధారిత విద్య, పరిశ్రమలతో అనుసంధానం మరియు విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలను బలోపేతం చేయడంలో ఆయన ముఖ్యపాత్ర పోషించనున్నారు.
విద్యార్థుల అభ్యాస అనుభవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అంతర్భాగంగా మార్చడం ఈ ఏజెంటిక్ ఏఐ క్యాంపస్ కార్యక్రమం లక్ష్యం.
విద్యార్థులు కేవలం ఏఐ టూల్స్‌ను ఉపయోగించడమే కాకుండా, తెలివైన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం, ఏఐ ఆధారిత అప్లికేషన్లను అభివృద్ధి చేయడం, వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని అంచనా వేయడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఏజెంటిక్ ఏఐ అనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించేందుకు అనేక పనులను ప్రణాళికాబద్ధంగా రూపొందించి, అమలు చేయగలిగే ఆధునిక తరం తెలివైన వ్యవస్థలను సూచిస్తుంది. తగిన మానవ పర్యవేక్షణతో పనిచేసే ఈ సాంకేతికత ద్వారా ఇంజినీరింగ్, బిజినెస్, డేటా ఆధారిత సేవలు మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల్లోని ఆచరణాత్మక అనువర్తనాలను విద్యార్థులు అన్వేషించే అవకాశాలను పొందనున్నారు.ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ నైపుణ్యాభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. తరగతి బోధన, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టులు, విద్యార్థుల మార్గదర్శకత్వంలో ఏఐను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా అధ్యాపకులకు అవసరమైన సహకారం అందించనున్నారు. దీంతో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. బాధ్యతాయుతమైన, నైతిక ఏఐ వినియోగానికి యూనివర్సిటీ అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. డేటా గోప్యత, విశ్వసనీయత, పక్షపాతం, పారదర్శకత, మానవ బాధ్యత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఏఐ రూపొందించిన సమాచారాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం, సమాచారాన్ని ధృవీకరించడం, తెలివైన వ్యవస్థల పరిమితులు, ప్రభావాలను అర్థం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించనున్నారు. ఈ కార్యక్రమంతో పాటు సమన్వయ కార్యక్రమాలను యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. కృష్ణాంజనేయులు ఈవెంట్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు.
తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించిన కెఎల్‌హెచ్ వర్సిటీ
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)