Magazines

పోలీస్ స్టేషన్‌‌ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

1 గంట క్రితం

Man attempts suicide at police station
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న 
ీటీ స్టాల్ నిర్వాహకుడు
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/భీంగల్
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ టీ స్టాల్ నిర్వాహకుడు.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. అక్కడి పోలీస్ సిబ్బంది, స్థానికులు హుటాహుటిన స్పందించి మంటలర్పి 108లో నిజామాబాద్ జీజీహెచ్‌కు తరలించారు. తదనంతరం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీంగల్‌కు చెందిన పి.సుధాకర్ స్థానికంగా టీ స్టాల్ నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. టీ స్టాల్ ఎదుట ఉన్న కిరణా షాప్ నుంచి ఇటీవల కాలంలో సిగరెట్లు కొనుగోలు చేయడం మానేయడంతో.. సదరు వర్తకుడు కక్ష పెట్టుకుని వేధిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరు విలేకరులను పంపి బెదిరింపులకు గురిచేశారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. పైగా తన టీ స్టాల్ ఎదుట వాహనాలు నిలిపి ఉంచుతున్నారన్న కారణంతో పోలీసులు తనపైన కేసు నమోదు చేశారని వాపోయాడు. దీనికి తోడు రాత్రి వేళలో సమయానికి మించి హోటల్ నడుపుతున్నట్టు ఈ పెట్టీ కేసు సైతం నమోదయింది. సదరు కిరాణ వర్తకుడు పోలీసులతో కలిసి తనను మానసికంగా వేధిస్తున్నట్టు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్టు బాధితుడు తెలిపాడు.

పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన..
పోలీసుల వేధింపులతోనే సుధాకర్ ఆత్మహత్యాయత్నం చేశాడని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. వేధింపులు ఎక్కువ అవ్వడంతోనే తట్టుకోలేక ఈ చర్యకు దిగినట్టు వాపోయారు.

పోలీసుల తప్పిదం లేదు : సీపీ
కాగా ఈ ఘటనలో పోలీసు తప్పిదం ఏమీ లేదని సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిరాణా దుకాణదారుడు ఇద్దరు విలేకరులతో కలిసి వేధింపులకు పాల్పడంతోనే సుధాకర్ ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని తెలిపారు. నిర్ణీత గడువుకు మించి అర్ధరాత్రి వరకు సైతం టీ స్టాల్ నిర్వహించడంతోనే పోలీసులు ఈ పెట్టీ కేసు నమోదు చేశారని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్