గోషామహల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ సీవీ.ఆనంద్
సభావేదిక, రాకపోకలు, పార్కింగ్‌పై సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి - హైదరాబాద్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. అక్టోబరు 21న గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు.
సభా వేదిక నిర్మాణం, ప్రముఖుల రాకపోకలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే పోలీసు అధికారులు, సిబ్బంది, ఇతర అతిథులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జన సమూహాన్ని దృష్టిలో ఉంచుకుని మార్గాలను స్పష్టంగా గుర్తించాలనీ, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
స్టేడియంలో కొనసాగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని డీజీపీ ఆనంద్ సమీక్షించారు. 48 గుర్రాలకు వసతి కల్పించే ఆధునిక అశ్వశాల సముదాయం, పోలీసు జాగిలాల కెన్నెల్స్, ఐదు అంతస్తుల సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) భవనం, క్రీడా మైదానాలు, అథ్లెటిక్స్ సదుపాయాల నిర్మాణాలను పరిశీలించారు. పనుల్లో జాప్యం చేయొద్దని ఆదేశించారు.
వచ్చే ఏడాది అక్టోబరు నాటికి స్టేడియం సముదాయాన్ని అన్ని సదుపాయాలతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
21న పోలీసు అమరవీరుల సంస్మరణ సభ
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)