ఏలూరి శ్రీనివాసరావు పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధికారులుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉద్యోగుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్యంగా కృషి చేయాలని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ – హైదరాబాద్ 2026-29 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి, ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ టీజీవోస్ అసోసియేషన్ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా హరికోట్ల రవి, ప్రధాన కార్యదర్శి జి.నరేంద్రతో పాటు నూతన కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి ఏలూరి శ్రీనివాసరావు, టీజీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర సంఘం సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
హక్కుల కోసం ఐక్యంగా కృషి
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)