ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్ ప్రక్రియను రద్దు చేయాలనీ, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను విధుల్లోంచి వెంటనే తొలగించాలని ఎంసీపీఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తమ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఈకే మురళి అధ్యక్షతన కేరళలోని అలువాలో ఈనెల 2,3,4 తేదీల్లో కేంద్ర కమిటీ సమావేశం జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పోరాటాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దేశంలోని ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను సార్వభౌమత్వాన్ని దెబ్బ కొట్టి ఫాసిస్టు మూలాలను నెలకొల్పే వైపు మోడీ పాలన సాగుతున్నదని విమర్శించారు. ఫిరాయింపు లను ప్రోత్సహిస్తూ ప్రతి పక్ష పార్టీలను చీలుస్తూ బారత ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్థంబాలను దెబ్బతీయటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సర్ పేరుతో ఏకపక్షంగా తొలగించబడిన ఓటర్లందరిని తిరిగి చేర్చాలనీ, ఈసీ సభ్యుల స్వతంత్ర నియామకం ప్యానెల్ ను నిర్ధారించే సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్ చేపట్టాక ఆయా రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికలను రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని కోరారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలపై నిర్బంధం, అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
సర్‌ను రద్దు చేయాలి.. జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి
54 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)