నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మైన్స్ అండ్ జియాలజీ గెజిటెడ్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆ సంఘం అధ్యక్షునిగా ఎం.నర్సి రెడ్డి, కార్యదర్శిగా కె.లక్ష్మీ నరసింహారావు ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ లోని టీజీవో భవన్ లో టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస రావు సమక్షంలో ఎన్నికల అధికారిగా బి. శ్యామ్ , సహాయ ఎన్నికల అధికారిగా డా. కె. రామారావు ఎన్నికలను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధికారులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పనిచేస్తున్న రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ మైన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ జియాలజిస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు సహా సుమారు 150 మంది గెజిటెడ్ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా జి.సంజయ్ కుమార్, కోశాధికారిగా కె. లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.
మైన్స్ అండ్ జియాలజీ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)