ముంబయి: ప్రయివేటు రంగం లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్‌పై మరోమారు కన్నెర్ర చేసింది. ఆర్బీఐ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 నిబంధనలు ఉల్లంఘించినం దుకు ఆ బ్యాంక్‌కు రూ.91 లక్షల జరిమానా విధించింది. వడ్డీ రేట్లు, ఆర్థికసేవల అవుట్‌సోర్సింగ్, కెవైసి నిబంధనలపై ఆర్బీఐ ఆదేశాలకు కట్టు బడి ఉండలేదని ఆగ్రహం వ్యక్తం చేస ింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఒకే రుణ కేటగిరీకి బహుళ రేట్లను ఉపయోగించింది. కేవైసీ నిబంధనల కనుగుణంగా ఉన్నారో లేదో నిర్ధారించే పనిని బాహ్య ఏజెంట్లకు అప్పగించ డాన్ని ఆర్బీఐ తప్పుబట్టింది. అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థ ఒక్కటి బ్యాంకింగ్ కంపెనీ చేప ట్టడానికి అనుమతించబడని వ్యాపారా న్ని నిర్వహించిన విషయాన్ని ఆర్బీఐ గుర్తించింది.



