Wednesday, October 1, 2025
E-PAPER
Homeజాతీయంవడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేట్‌ను మరోసారి యథాతథంగా ఉంచింది. విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా వరుసగా రెండోసారి రెపోరేట్‌ను 5.5 శాతం వద్దే కొనసాగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ.. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. అలా మూడు వరుస సమీక్షల్లో కలిపి రెపోరేట్‌ 1% తగ్గింది. ట్రంప్‌ టారిఫ్‌ ప్రకటనలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆగస్టులో మాత్రం యథాతథంగా 5.5 శాతం వద్దే ఉంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -