Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeజాతీయం2వేల నోట్లపై RBI కీలక ప్రకటన

2వేల నోట్లపై RBI కీలక ప్రకటన

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సోమవారం కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత రిజర్వ్‌ బ్యాంక్‌ 2016 నవంబర్ 8న రూ.2వేల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీకి బ్రేకులు వేసేందుకు కేంద్ర నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీని కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రూ.2వేల నోట్లను తీసుకువచ్చింది.

కాగా, రూ.2000 నోట్లను అధికారికంగా ఆర్బీఐ 19 మే 2023న చలామణి నుండి ఉపసంహరించుకుంది. 19 మే 2023 నాటికి 98.26 శాతం రూ. 2 వేల నోట్లు తిరిగి వచ్చాయని తెలిపింది. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద ఈ నోట్లు ఉండటంతో వాటిని ఎంపిక చేసిన పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad