నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పటిదార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌లకు వారి జట్ల స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కమ్మిన్స్ జట్టు ఈ సీజన్‌లో చేసిన మొదటి నేరం కావడంతో రూ. 12 లక్షల జరిమానా విధించగా, రెండోసారి నేరం చేసిన ఆర్‌సీబీ జట్టు సారథి పటిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా వేసింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో ఆర్‌సీబీ చేసిన రెండవ నేరం ఇది. కాబట్టి పటిదార్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఇందులో ఏది తక్కువైతే అది జరిమానా విధించడం జరిగింది ” అని ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.
“కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టు చేసిన మొదటి నేరం. కాబట్టి కమిన్స్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది” అని ప్రకటించింది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్‌సీబీకి జితేశ్ శర్మ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే, రెగ్యులర్ కెప్టెన్‌కే ఫైన్ వర్తించనున్నట్లు సమాచారం. దీంతో రజత్‌కు రూ. 24లక్షల భారీ జరిమానా పడింది.