- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే ఆర్సీబీ తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్‌లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.
- Advertisement -



