Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డివో, డీఎస్పీ

మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డివో, డీఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ- కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు కట్టంగూరు మండల కేంద్రంలో జరిగే ముగ్గురు మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. సోమవారం మండల కేంద్రంలోని సంత ఆవరణలో మంత్రుల సభ నిర్వహించే ప్రదేశాన్ని నల్గొండ ఆర్డీవో యారాల అశోక్ రెడ్డి, నల్గొండ డి.ఎస్.పి కొలను శివరాం రెడ్డిలు పరిశీలించారు. వేదిక, సభాస్థలి ఏర్పాటు విషయంలో సూచనలు చేశారు.  మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించే సభలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మంత్రుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఐటిపాముల సమీపంలోని జాన్ బి.ఎడ్ కళాశాలలో హెలిప్యాడ్ కు స్థలాన్ని నిర్ణయించారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా మంత్రులు మండల కేంద్రంలోని సభాస్థలికి చేరుకుంటారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ రూరల్ సిఐ కొండల్ రెడ్డి, ఎస్సై ఎం రవీందర్, ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, డిప్యూటీ తాసిల్దార్ ఫ్రాంక్లిన్ రాబర్ట్, మాజీ జెడ్పిటిసిలు సుంకరబోయిన నర్సింహ్మా , మాద యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నాయకులు రెడ్డిపల్లి సాగర్,  గద్దపాటి దానయ్య, మిట్టపల్లి శివ, ముక్కామల శేఖర్, పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -