Sunday, December 28, 2025
E-PAPER
Homeజాతీయంశంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విమానాల్లో RDX.. సిబ్బంది అప్రమత్తం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విమానాల్లో RDX.. సిబ్బంది అప్రమత్తం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండిగో విమానాలకు మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆదివారం కొచ్చి, జెడ్డా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విమానాల్లో RDX అమర్చినట్లు గుర్తు తెలియని అగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

ఈ ఒక్క ఏడాదిలోనే 30 సార్లకు పైగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు నిర్ధారించారు. బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆ అగంతకుడు ఎవరు? అని దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి.

మొన్న గురువారం కూడా సౌదీ అరేబియా నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరిన అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన భద్రతాధికారులు.. ఆ విమానం స్థానికంగా ల్యాండింగ్‌ అయిన వెంటనే తనిఖీలు చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జీహెచ్‌ఐఏఎల్‌ అధికారుల ఫిర్యాదుతో ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -