Monday, July 21, 2025
E-PAPER
Homeజాతీయంఆపరేషన్‌ సింధూర్‌పై చ‌ర్చ‌కు సిద్ధ‌మే: జేపీ న‌డ్డా

ఆపరేషన్‌ సింధూర్‌పై చ‌ర్చ‌కు సిద్ధ‌మే: జేపీ న‌డ్డా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పెహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ అంశంపై పూర్తిస్థాయిలో చర్చించడానికి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ లీడర్‌, కేంద్ర మంత్రి జెపి నడ్డా అన్నారు. దేశానికి స్వాతంత్యం వచ్చినప్పటి నుండి ఇలాంటి ఆపరేషన్‌ ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు.

కాగా, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే నిబంధన 267 కింద ఆపరేషన్‌ సింధూర్‌, పెహల్గామ్‌ దాడి అంశాలై చర్చించాలని నోటీసు ఇచ్చారు. అయితే ఈ ఖర్గే నోటీసు రూల్‌ 267కి విరుద్ధమని నడ్డా పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బిజినెస్‌ అడ్వైజరీ కౌన్సిల్‌లో ఈ విషయాలను చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఏ అంశంపైన అయినా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమని నడ్డా తెలిపారు. సమిక్‌ భట్టాచార్య రూల్‌ 167 కింద స్వయంగా బిజెనెస్‌ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేషన్‌ సింధూర్‌పై సభలో చర్చకు అంగీకరిస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధనకర్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -