- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తోందన్నారు. 5, 6 తేదీల్లో ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైందని, సంస్థ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ముందకెళ్తోందన్నారు. ఇబ్బందికర పరిస్థితులు తేవొద్దని సూచించారు.
- Advertisement -