Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఅమెరికా పౌరసత్వం కోసం రియాల్టీ షో

అమెరికా పౌరసత్వం కోసం రియాల్టీ షో

- Advertisement -

– ట్రంప్‌ ప్రభుత్వ యోచన
వాషింగ్టన్‌:
అమెరికా పౌరసత్వం కోసం రియాల్టీ టివి షోను నిర్వహించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఈ షోలో వలసదారులు అమెరికా పౌర సత్వం కోసం పోటీ పడతారు. అమెరికా హోం ల్యాండ్‌ భద్రతా విభాగం (డీహెచ్‌ఎస్‌) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఆలోచన గురించి డిహెచ్‌ఎస్‌ను సంప్రదించగా, ఆలోచన చేస్తున్న మాట వాస్తవమేనని అయితే ఇంతవరకు ఇది ఎలాంటి ఆమోదం లేదా తిరస్కరణ పొందలేదని తెలిపింది. ఆమోదించడం లేదా తిరస్కరణకు ముందుగా దీనిపై కూలంకషంగా పరిశీలన జరపాల్సిన అవసరం వుందని పేర్కొంది. ఈ దేశంలో దేశభక్తిని, పౌర బాధ్యతలను పునరుద్ధరించాల్సిన అవసరం వుందని అందుకోసం ఇలాంటి అంశాలను పరిశీలిస్తున్నామని ప్రజా వ్యవహరాల సహాయ మంత్రి ట్రిసియా మెక్‌ లాఫ్‌లిన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కెనడియన్‌ అమెరికన్‌ రాబ్‌ వోర్సోఫ్‌ అనే వ్యక్తి ఈ షో ఆలోచనను ప్రతిపాదించారు. ఇందులో పోటీ పడేవారు తాము అమెరికన్‌ అని నిరూపించుకోవాల్సి వుంటుంది. ఇందులో ఓడిపోతే వెంటనే దేశం నుంచి బయటకు పంపివేస్తారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వలసదారులను బయటకు పంపాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌, హైతి, వెనిజులా వంటి దేశాలకు చెందిన పౌరులకు కల్పించిన టీపీఎస్‌ (తాత్కాలిక రక్షణ హోదా)ను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad