– నాలుగు ముఠాలు దొంగల ముఠాలలో మొత్తం 16 మంది సభ్యులు అరెస్ట్
– మొత్తం 26 నేరాలలో 200లకు పైగా మేకలను దొంగలించిన ముఠా సభ్యులు
– రెండులక్షల నలబై ఆరు వేల రూపాయల నగదు, 2 లక్ష డెబ్బైయిదు వేల రూపాయల విలువ గల 22 గొర్రెలు , 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ .
– 30కి పైగా నేరాలలో నిందితులు
– జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : గ్రామాలలో పగలు రెక్కి నిర్వహించి.ఖరీదైన కార్లలో రాత్రి సమయాలలో మహిళలతో కలిసి మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. గత కొంత కాలంగా జిల్లా లో మేకలు , గొర్రెలు దొంగతనం చేస్తున్ననాలుగు ముఠాలు దొంగల ముఠాలలో మొత్తం 16 మంది సభ్యుల ను అరెస్ట్. చేసి రెండులక్షల నలబై ఆరు వేల రూపాయల నగదు, 2 లక్ష డెబ్బైయిదు వేల రూపాయల విలువ గల 22 గొర్రెలు , 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ చేసి రిమాండ్ తరలించినట్లు ప్రకటించారు. సోమవారం శాలిగౌరారం పోలీస్ వారు బైరవోనిబండ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీ చేపడుతున్న సమయంలో వారిని చూసి ఒక షిఫ్ట్ డిజైర్ కారు ఏపీ 09 బి క్యూ 3128 వాహనం వారి నుండి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించగా వెంటనే శాలిగౌరారం పోలీస్ వారు అట్టి వాహనాన్ని పట్టుబడించి అందులో (03) మగవారు, (01) మహిళా ఉన్నారు. వారిని మా వద్ద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు సంపంగి వెంకటేష్ 2 వెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సంపంగి శారద దాసర్ల వినోద్ కుమార్ @ కోటి వీరి పైన గతంలో నల్గొండ రూరల్ పిఎస్, కనగల్, చండూర్, విజయపురి, నార్కట్ పల్లి, నల్గొండ 2 టౌన్, మర్రిగూడ, దేవరకొండ, శాలిగౌరారం, నాంపల్లి, మునుగోడు, చింతపల్లి పిఎస్ లలో మేకల దొంగతనాల నేరాలలో నిందితులు. వీరు గతంలో జైలుకు వెళ్ళినా బైలు పై వచ్చిన ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అని చెప్పారు.
అనుకున్న ప్రకారంగా వీరికీ పరిచయం ఉన్న వారందరూ కలిసి నాలుగు గ్యాంగ్ లుగా ఏర్పడి ఎవరికీ అనుమానం రాకుండా ఖరీదైన కార్లలో వచ్చి పగటి పూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాలలో ఖరీదైన కార్లలో వచ్చి మేకలను కార్లలో వేసుకొని మేకల దొంగతనాలకు పాల్పడుతుంటారు. పట్టుబడిన నేరస్థులు చెప్పిన వివరాల ప్రకారంగా నల్గొండ జిల్లాలో మొత్తం 15 చోట్ల మరియు రాచకొండ, సైబరాబాద్, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో 10 చోట్ల మేకల దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. వీరు దొంగలించిన మేకలను సంతలలో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకుంటారు.
ఇట్టి 26 నేరాలలో సంబంధించి 200 లకు పైగా మేకలను రెండు లక్షల నలబై ఆరు వేల రూపాయల నగదు, 2 లక్ష డెబ్బైయిదు వేల రూపాయల విలువ గల 22 గొర్రెలు మరియు 47 లక్షల విలువ గల 8 కార్లు సీజ్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది.
ప్రశంస పత్రాలు రివార్డులు.
ఇట్టి ముఠా సభ్యులను నల్గొండ డి.ఎస్.పి..కె.శివరాం రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, నల్గొండ సి.సి.ఎస్ ఇన్స్పెక్టర్ ఎమ్.జితేంధర్ రెడ్డి, యం.నాగభూషణ్, కె.కొండల్ రెడ్డి, ఇన్స్పెక్టర్ శాలిగౌరారం,నార్కట్ పల్లి సిఐ కె.నాగరాజు,యస్.ఐలు శివ కుమార్,విజయ్ కుమార్,రవి,రవి కుమార్, సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, వహీద్ పాషా,సూఫీయాన్ అలీ,రామ్ ప్రసాద్,నాగరాజు, సిసిఎస్, కానిస్టేబుల్ అశ్రార్,మహేశ్,వెంకట్ రామ్ ,సాయి , ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి. , ప్రత్యేకంగా అభినందించి ప్రశంశా పత్రాలు అందజేసి రివార్డును ప్రకటించారు
పగలు రెక్కీ ..రాత్రి దొంగతనాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES