Wednesday, October 22, 2025
E-PAPER
Homeజాతీయంరిటైర్మెంట్‌ తర్వాతప్రభుత్వ పోస్టు స్వీకరించను

రిటైర్మెంట్‌ తర్వాతప్రభుత్వ పోస్టు స్వీకరించను

- Advertisement -

సీజేఐ బీఆర్‌ గవారు
అమరావతి :
పదవీ విరమణ తర్వాత ఎటువంటి పోస్టును స్వీకరించబోను అని సీజేఐ బీఆర్‌ గవారు పేర్కొన్నారు. మహా రాష్ట్రలోని అమరావతి జిల్లాలోని దారాపూర్‌ స్వగ్రామంలో ఆయన్ను శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్మెంట్‌ తర్వాత ఎటువంటి ప్రభుత్వ హౌదాను స్వీకరించబోను అని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రిటైర్మెంట్‌ తర్వాత తనకు కావాల్సినంత సమయం దొరుకుతుందని, అప్పుడు ఎక్కువ సమయాన్ని దారాపూర్‌, అమరావతి, నాగపూర్‌లో గడపనున్నట్టు ఆయన తెలిపారు. సీజేఐ గవారు ఈ ఏడాది నవంబర్‌లో రిటైర్‌ కానున్నారు. స్వగ్రామంకు విచ్చేసిన గవారుకు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. కేరళ, బీహార్‌ మాజీ గవర్నర్‌, తండ్రి ఆర్‌ఎస్‌ గవారు స్మారకం వద్ద నివాళి అర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన వార్షిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దారాపూర్‌ మార్గంలో నిర్మించనున్న గేట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ గేట్‌కు ఆర్‌ ఎస్‌ గవారు పేరు పెట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -