Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సూర్యు"డీ"ని స్వీకరించండి: డా. దిలీప్ 

సూర్యు”డీ”ని స్వీకరించండి: డా. దిలీప్ 

- Advertisement -

పగటిపూట ఆటలతో చిన్నారులకు డీ- విటమిన్
నవతెలంగాణ – దుబ్బాక 
రోజంతా నాలుగు గోడల మధ్య చదువులు.. ఇంటికి రాగానే హోం వర్క్ లేదంటే స్మార్ట్ ఫోన్లతో టైం పాస్ చేస్తున్న బాల బాలికలు పలు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం, ఉరుకుల పరుగుల జీవన విధానం, క్రీడలకు దూరంగా ఉండటం తదితర కారణాలతో ఇబ్బందులు తప్పడం లేదు. రోగనిరోధక శక్తిని పెంచి పిల్లల ఎదుగుదలకు ఎముకలు దృఢంగా మారడంలో కీలకమైన విటమిన్ “డీ” ని పొందక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

సూర్య రష్మి నుంచి అధిక మొత్తంలో…

సూర్యరష్మి నుంచి విటమిన్ ‘ డీ’ శరీరానికి అధిక మొత్తంలో అందుతుంది. క్యాల్షియం స్థాయి పెంచి ఎముకలు దృఢంగా మారుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారంతోను విటమిన్ ఉత్పత్తి జరుగుతుంది.

సూర్య రష్మీ లోపిస్తే కలిగే నష్టాలు..

రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కండరాల బలహీనత, కీళ్ల నొప్పులు వస్తాయి. తరచూ జలుబు, జ్వరం, అలసట, నీరసం ఏర్పడుతుంది. ఆందోళన, ఒత్తిడి సమస్యలు, జుట్టు రాలడం, జీర్ణ సంబంధిత ఇబ్బందులు. వినికిడి శక్తి తగ్గుతుంది.

ఎలా అధిగమించాలంటే….

నిత్యం సూర్య కాంతి తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం వారానికి రెండు సార్లు అరగంట పాటు శరీరంపై ఎండ పడేలా చూడాలి. ఆవు పాలు, కోడిగుడ్లు, వెన్న, చేపలు తీసుకోవాలి. పుట్టగొడుగులు, సంత్రాలు, బచ్చలి ఆకుకూరలో విరివిగా లభిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒత్తిడికి గురికావద్దు. ఒత్తిడిని తగ్గించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా మద్యం, మాంసం తీసుకోకూడదు. షుగర్ పేషెంట్లు, బాధితులు ఇన్ టైం లో మందులు వాడాలి. లేకపోతే సమస్య మరింత తీవ్రమవుతుంది. చిన్నపిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి సోకకుండా శుభ్రత పాటించడం వంటివి నేర్పించాలి. పౌష్టికాహారాన్ని అందించాలి.

డాక్టర్ ఏ.దిలీప్, జనరల్ ఫిజీషియన్, ఎంబీబీఎస్, ఎఫ్ఐపీ (ఫెలోషిప్ ఇన్ పీడియాట్రిక్), ఎఫ్ఐడీ (ఫెలోషిప్ ఇన్  డయాబెటాలజీ), అమృత హాస్పిటల్, దుబ్బాక.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -