నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో పలు రోజులన్ని భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరభారత్ లోని పలు రాష్ట్రాలకు భారత్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు రెడ్ అలర్డ్ ఇచ్చింది. భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. 15సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది. అదే విధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, లేహ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాల్లో గంటకు 5-15 మి.మీ మధ్య మోస్తరు వర్షపాతం, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది.
ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్: ఐఎండీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES