నేడు ప్రపంచ నలుమూలలా విస్తరించి కొనసాగుతున్న స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే అది రెడ్‌క్రాస్. నోబెల్ శాంతి బహుమతి-1901 గ్రహీత హెన్రీ డ్యునాంట్ 1864లో నిర్వహించిన జెనీవా సమావేశంలో తీర్మానించిన ప్రకారం ఈ సంస్థ ప్రారంభం కావడం, నేషనల్ సొసైటీగా విస్తరించి 17 మిలియన్ల స్వచ్ఛంధ కార్యకర్తలతో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. హెన్రీ డ్యునాంట్ జన్మదినం 08 మే రోజున ప్రతియేటా ”ప్రపంచ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ దినోత్సవం” పాటించుట 1948 నుంచి ఆనవాయితీగా వస్తున్నది. ”మానవత్వంతో శాంతి వైపు (విత్ హుమానిటీ, టువర్డ్స్ పీస్)” అనే నినాదంతో ఒక తటస్త, నిష్పాక్షిక మానవీయ సంస్థగా రెడ్ క్రాస్ నేడు ప్రపంచవ్యాప్తంగా తన సేవాహస్తాలను విస్తరించి ముందుకు సాగడం విశేషం. ప్రపంచ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ దినోత్సవం-2025 ఇతివృత్తంగా ”మానవీయతను పోషిస్తూనే: విశ్వాసం, సహాయం, స్వస్థత (కీపింగ్ హుమానిటీ ఎలైవ్ : హోప్, హెల్ప్, హీల్)” అను అంశాన్ని తీసుకోని అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రెడ్ క్రాస్ స్వచ్ఛంధ సేవకులు ప్రతికూలమైన ప్రమాదకరమైన మారుమూల ప్రాంతాల్లో సహితం ధైర్యంగా తమ అత్యవసర సేవలైన ఆహారాన్ని అందించి ఆకలి చావులపడం, ప్రకృతి వైపరీత్యాల సమయం అవసర సేవలందించడం, వైద్య ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవడం తమ విధిగా భావిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నది. యుద్ధ బాధితులను ఆదుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆపన్నహస్తం అందించడం, అంటువ్యాధులు ప్రబలినపుడు రక్షణ గొడుగుగా నిలవడం లాంటి అసంఖ్యాక అత్యవసర సేవలను కొనసాగిస్తున్నది. ఏడు మౌలిక సూత్రాల పునాదిగా రెడ్‌క్రాస్ సొసైటీలు ఏర్పడ్డాయి. మానవత్వం, నిష్పక్షపాతం, తటస్త స్థితి, స్వయం ప్రతిపత్తి, స్వచ్ఛంధ సేవలు, ఏకత, విశ్వవ్యాప్తం అనబడే సేవలు నిరాటకంగా, వేగంగా కొనసాగుతున్నాయి. భారతీయ రెడ్ క్రాస్ సేవలు దాదాపు పదకొండు వందల సొసైటీల ద్వారా తమ సేవలను కొనసాగిస్తున్నాయి. నిత్యం జరిగిగే సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ, అవసర పేదలకు కనీస ధరలకు రక్తాన్ని అందించడం ”రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్”ల ద్వారా కొనసాగుతున్నది. సహజ విపత్తులు, యుద్ధ ప్రాంతాలు, మారు మూల ప్రాంతాలకు సహితం ముందుగా చేరి తమ అమూల్య సేవాహస్తాలను అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ అమ్మవలే ఆదుకోవడం అభినందనీయం.
– బీఎంఆర్
మానవత్వానికి ఊపిరి ‘రెడ్‌క్రాస్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES