Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసీఏపీఎఫ్‌ల్లో ఐపీఎస్‌ పోస్టింగులను తగ్గించండి

సీఏపీఎఫ్‌ల్లో ఐపీఎస్‌ పోస్టింగులను తగ్గించండి

- Advertisement -

– సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ:
పోలీసు అధికారుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేందుకు గానూ కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్‌్‌) ఐపీఎస్‌ పోస్టింగ్‌లను తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఏపీఎఫ్‌ల్లో ఇనస్పెక్టర్‌ జనరల్‌ ర్యాంక్‌ వరకు ఐపీఎస్‌ అధికారుల డిప్యుటేషన్‌ను రాబోయే రెండేండ్లలో గణనీయంగా తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తద్వారా కేడర్‌ అధికారులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. ఈమేరకు మే 23న జస్టిస్‌ అభరు ఎస్‌.ఓఖా, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన బెంచ్‌ ఉత్తర్వులను వెలువరించింది. సీఏపీఎఫ్‌ల్లో కేడర్‌ అధికారుల ప్రమోషన్లలో జాప్యం జరగడంతో అది వారి మానసిక, నైతిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలదని హెచ్చరించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad