Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంతిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 – 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -