– సీఎస్‌కు ఎస్టీయూటీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విద్యాభివృద్ధికి పాఠశాల విద్యావిధానంలో సంస్కరణలు అనివార్యమని ఎస్టీ యూటీఎస్ అభిప్రాయపడింది. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె రామకృష్ణారావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్టీయూటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశాలు, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన సంస్కరణలు, ప్రతిపాదనలను అందజేశారు. విద్యాకమిషన్ చైర్మెన్ ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను దృష్టిలో ఉంచుకుని వాటిలో సాధ్యాసాధ్యాలను లోతుగా చర్చించి తాము ప్రతిపాదలను తయారు చేశామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలనీ,, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కోరారు. సబ్జెక్టుల వారీగా సిలబస్, పరీక్షలు, విద్యార్థుల నమోదు, రవాణా సౌకర్యం, పాఠశాలల నిర్వహణ వంటి అంశాలు క్షేత్రస్థాయి ఇబ్బందులు, పరిష్కార మార్గాలను లోతుగా అధ్యయనం చేసి నివేదికను రూపొందించామని వివరించారు. తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ మరింత బలోపేతం కావడానికి ఇవి ఉపయోగపడతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర బాధ్యులు ఎల్‌ఎం ప్రసాద్, దాసరి శ్రీధర్, పోల్‌రెడ్డి, ఇఫ్తేకారుద్దీన్, రామసుబ్బారావు, సాబేర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
విద్యావిధానంలో సంస్కరణలు అనివార్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES